కళ్యాణదుర్గం: కొత్తూరు లో విషాదం, రామాంజనేయులు (50) అనే రైతు అప్పులు బాధ తాళలేక పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య
కళ్యాణదుర్గం మండలం కొత్తూరు గ్రామంలో ఆదివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు (50) అప్పుల బాధ తాళలేక గ్రామ శివారులోని పొలంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. గ్రామస్తులు ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు కొత్తూరు గ్రామానికి వెళ్లారు. రామాంజనేయులు మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.