బనగానపల్లె: సంజామల మండలంలో ఈదురుగాలుల బీభత్సం
నంద్యాల జిల్లా సంజామల మండలంలోని ముక్కమల్ల, ఆకుమల్ల, ఆల్వకొండ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో గ్రామాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి ఆరబోసిన మిరప, వరి ధాన్యం తడవడంతో పాటు పలుచోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.