మాడుగులలో బొలెరో వాహనం ఢీకొని నాలుగేళ్ల బాలుడు మృతి
అనకాపల్లి జిల్లా విమాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోగల మాడుగుల మండల కేంద్రంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది .గురువారం నాడు బొలోరో వాహనం ఒక బాలుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు గొంపాన జయంత్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై మాడుగుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.