ఒంగోలు అర్బన్: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలి: మంత్రి
Ongole Urban, Prakasam | May 20, 2026
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్దంతి సందర్బంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయకుమార్, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, టంగుటూరి ప్రకాశం పంతులు మునిమనుమడు టంగుటూరి సంతోష్, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో టంగుటూరి కీలక పాత్ర పోషించారన్నారు.