కడప: అత్యవసర సేవల నిమిత్తం కాకినాడకు బయలుదేరిన కడప జిల్లా  విద్యుత్ సిబ్బంది
Kadapa, YSR | Oct 28, 2025 మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న కాకినాడ జిల్లాలో విద్యుత్ అంతరాయాలకు ఇబ్బంది ఉండకూడదని కడప జిల్లా నుంచి ప్రత్యేక బృందాలను పంపించామని SE రమణ పేర్కొన్నారు. అధికారుల ఆదేశాల మేరకు కడప జిల్లా నుంచి 23 బృందాలు మొత్తం 230 మంది విద్యుత్ సిబ్బంది అత్యవసర సేవల నిమిత్తం కడప విద్యుత్ భవన్ నుంచి బయలుదేరారని తెలిపారు. కాకినాడలో ఇబ్బందులు తొలగిన అనంతరం తిరుగు ప్రయాణం అవుతారని SE రమణ వివరించారు.