పరిటాల శ్రీరామ్ ముందే తాడిమర్రి తహసిల్దార్ అవినీతిని బయటపెట్టిన రైతులు.
ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ ముందే తాడిమర్రి తాసిల్దార్ భాస్కర్ రెడ్డి చేస్తున్న అవినీతి కార్యక్రమాలను రైతులు బయటపెట్టిన సంఘటన నిన్నటి రోజు చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆలస్యంగా బయటకు రావడంతో వైరల్ గా మారింది. తహసిల్దార్ భాస్కర్ రెడ్డి వివిధ సమస్యలపై వచ్చిన రైతులతో వేలకు వేలు డబ్బులు తీసుకొని వారి పనులు చేయకుండా తిప్పుతున్నాడని పరిటాల శ్రీరామ్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు తక్షణమే తహసిల్దార్ కార్యాలయానికి చేరుకున్న పరిటాల శ్రీరామ్ ముందే రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన చోటుచేసుకుంది.15 రోజుల్లో రైతుల సమస్యలు తీర్చాలని శ్రీరామ్ తెలిపారు.