డ్రగ్స్ నివారణ మార్గాలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు: ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయేషా బేగం
Ongole Urban, Prakasam | Jul 12, 2025
జిల్లాస్థాయిలో కేర్ కమిటీ ద్వారా డ్రగ్స్ నివారణ మార్గాలు తీసుకోవలసిన జాగ్రత్తల పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిషనల్ సూపరింటెండెంట్ షేక్ అయేషా బేగం అన్నారు. శనివారం మధ్యాహ్నం ఒంగోలులోని ఎక్సైజ్ కార్యాలయం నందు మీడియాతో మాట్లాడారు. జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థులు డ్రగ్స్ పై అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాటి నివారణకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో జిల్లావ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.