ఒంగోలు అర్బన్: మాదకద్రవ్య రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | May 27, 2026
మాదకద్రవ్య రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణే లక్ష్యంగా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా సంబంధిత అధికారులతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమావేశం ( ఎన్ కార్డ్ కమిటీ ) నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 20 హాట్ స్పాట్ లలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలన్నారు. ఎక్సైజ్, పోలీస్ అధికారులు ఈ ప్రాంతాలపై మరింత దృష్టి సారించాలని ఆయన చెప్పారు. మాధక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.