కొత్తగూడెం: కులం పేరుతో దూషించిన ముగ్గురిపై కేసు నమోదు చేసిన సుజాతనగర్ పోలీసులు, దర్యాప్తు చేసిన కొత్తగూడెం డిఎస్పి
సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం గ్రామం లెనిన్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న 55 సంవత్సరాల మాదిగ కులానికి చెందిన మహిళను నాయకులగూడెం గ్రామానికి చెందిన నరసయ్య అతని భార్య చల్ల పుల్లమ్మ,కొడుకు అచ్చయ్య ముగ్గురు కలిసి కులం పేరుతో దూషించి ఆమెని కొట్టడానికి వచ్చారని మరియు బూతులు తిట్టారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పై వ్యక్తుల మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా గురువారం సాయంత్రం సమయంలో కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ మరియు చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్,వెంకటేశ్వర్లు, సుజాతనగర్ ఎస్సై రమాదేవి, మండల పరిధిలోని లెనిన్ నగర్ లోని నేరస్థలానికి వచ్చి కేసు దర్యాప్తు చేశారు.