పటాన్చెరు: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు రోడ్డుపై చేరి రోడ్లు బురదమయంగా మారాయి.