ఒంగోలు అర్బన్: పోతవరం గ్రామంలో పర్యటించి పల్లెనిద్ర కార్యక్రమం అనంతరం గ్రామ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 11, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు దర్శి నియోజకవర్గంలో పల్లెనిద్ర కార్యక్రమం లో భాగంగా పర్యటించారు. శుక్రవారం రాత్రి పోతవరం గ్రామంలో ప్రజలతో మాట్లాడి అక్కడే నిద్రించారు. శనివారం ఉదయాన్నే కలెక్టర్ గ్రామంలో పర్యటించి స్థానిక సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మంచినీటి సమస్య స్థానిక సమస్యలపై అధికారులతో మాట్లాడారు. గ్రామ వీధులలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడారు.