బాల్కొండ: ఎంపీ అరవింద్ తప్పుడు మాటలతో జిల్లా ప్రజలను మభ్య పెడుతున్నాడు: వేల్పూర్ లో DCC అధ్యక్షులు మోహన్ రెడ్డి ఆరోపణ
ఎంపీ అరవింద్ తప్పుడు మాటలతో జిల్లా ప్రజలను మభ్యపెడుతున్నాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడితే గ్రామ గ్రామాన కార్యకర్తలు తరిమి కొడతారని హెచ్చరించారు. వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ అరవింద్, స్థానిక శాసన సభ్యులు ప్రశాంత్ రెడ్డిలు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.