నంద్యాల అర్బన్: నంద్యాల విద్యుత్ కార్యాలయం వద్ద ఘనంగా మే డే వేడుకలు
Nandyal Urban, Nandyal | May 1, 2026
నంద్యాల విద్యుత్ కార్యాలయం వద్ద 1104 యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మే డే వేడుకలు నిర్వహించారు. యూనియన్ డివిజన్ సెక్రెటరీ సతీష్ కుమార్ జెండా ఆవిష్కరించి, కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. 76 ఏళ్లుగా విద్యుత్ కార్మికుల సంక్షేమం కోసం తమ యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యుత్ శాఖ సిబ్బంది, కార్మిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.