ఒంగోలు అర్బన్: ఒంగోలులో క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే జనార్ధన్
Ongole Urban, Prakasam | May 3, 2026
ఒంగోలు ఏసిఏ సబ్ సెంటర్లో ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 'క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ 2026'ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శిక్షణ శిబిరంతోపాటు ఆధునిక బౌలింగ్ మిషన్ సౌకర్యాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కారసాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జిల్లాలోని యువ క్రికెటర్లలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడమే తమ బాధ్యతన్నారు.