అబ్దుల్లాపూర్మెట్ పరిధి JNNURM కాలనీలో ఆడుకుంటూ తప్పి పోయిన ఓ బాలుడుని సురక్ష సేవా సంఘం చేరదీసింది. అనంతరం తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా అప్పజెప్పారు. బడిఈడు పిల్లలతో ఆరుష్ ఆడుకుంటూ శుక్రవారం రా. 11 సమయంలో తప్పిపోయాడు. SSS సభ్యుడు అంజద్ పాషా అతన్ని గమనించి దగ్గరకు తీసుకున్నాడు. వెంటనే తల్లిదండ్రుల వివరాలు ఆరాతీసి రా. 12 సమయంలో SSS రాష్ట్ర అధ్యక్షుడు కిక్కర గోపీశంకర్ యాదవ్ సమక్షంలో అప్పజెప్పారు.