ఒంగోలు అర్బన్: ఒంగోలు పట్టణంలోని కబాడీపాలెంలో ద్విచక్ర వాహనం దగ్ధం, అనుమానం వ్యక్తం చేస్తున్న ద్విచక్ర వాహన యజమాని
Ongole Urban, Prakasam | Jul 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కబాడీపాలెంలో సోమవారం అర్ధరాత్రి ద్విచక్ర వాహనం దగ్ధమైంది, స్థానికంగా ఉండే రాజేష్ అనే వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనం ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెంది పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మంటలను ఆరిపేలోపే వాహనం మొత్తం కాలిపోయింది. బాధితుడు జరిగిన ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఎవరు కావాలని ఈ ఘటనకు పాల్పడినట్లు అన్నాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.