గుర్రంపోడు: తుర్కపల్లి స్టేజి సమీపంలోని నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై గేదెను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి
నల్గొండ జిల్లా, గుర్రంపొడు మండల పరిధిలోని తుర్కపల్లి స్టేజి సమీపంలో నల్గొండ-దేవరకొండ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనదారుడు గేదెను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు అనుముల మండలం, మారేపల్లి గ్రామానికి చెందిన గణపతి వెంకన్నగా గుర్తించారు. మక్కపల్లి లో జరిగిన బొడ్రాయి వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న గేదెను ఢీకొని తలకు బలమైన గాయాలయి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.