ధర్మవరం : గుడి దొంగల ముఠాను అరెస్టు చేసిన ధర్మవరం రూరల్ ఎస్సై.
ధర్మవరం మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల ముఠాను ధర్మవరం రూరల్ ఎస్సై శ్రీనివాసులు శనివారం అరెస్టు చేశారు. గురునాథం అంజయ్య, గురునాథం ఆంజనేయులు, గురునాథం వెంకటేశ్వర్లు అనే ఈ ముగ్గురు వరసకు బంధువులు అవుతారని ధర్మవరం చుట్టుపక్కల ఉన్న పలు ఆలయాల్లో రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. వీరి వద్ద నుండి 30 వెండి గొడుగులు రెండు తాళిబొట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపాడు.