ఎల్ వి ఎన్ 3 - ఎం 5 రాకెట్ విజయవంతం కావాలని పూజలు
- సూళ్లూరుపేట అమ్మణ్ణిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని శనివారం రాత్రి ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించి పూజలు నిర్వహించారు. శ్రీహరికోట నుండి ఆదివారం సాయంత్రం ఐదు ఇరవై ఆరు గంటలకు జరిగే ఎల్విఎం 3ఎం5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకొని పూజలు చేశారు. వారిని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసన్నలక్ష్మి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సత్కరించారు. ఈ కార్యక్రమంలో గణపతి బాయ్ పటేల్, షార్ డైరెక్టర్ పద్మ కుమార్, శాస్త్రవేత్తలు, షార్ గ్రూప్ మేనేజర్ గోపికృష్ణ, ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, తదితరులు పాల్గొన్నారు.