అమలాపురంలో కవాతు నిర్వహించిన కేంద్ర పోలీస్ బలగాలు
అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో కేంద్ర పోలీస్ బలగాలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం కవాతు నిర్వహించాయి. ఈ మేరకు పట్టణ పరిధిలోని ప్రాంతాలలో స్థానిక పోలీస్ అధికారులు ప్రజలకు ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి వివరించి ఓటు హక్కును వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.