నంద్యాల జిల్లాలో పలు మండలాలు ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం
నంద్యాల జిల్లాలో గురువారం రాత్రి పలు మండలాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. గత రెండు రోజులుగా జిల్లాలో ఎండ తీవ్రత కు అల్లాడిపోయిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురవడంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే గాలుల దాటికి మామిడి అరటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.