గరిడేపల్లి: కీతవారిగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన
గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. సొసైటీ ఛైర్మన్ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడని.. అతనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఈఓకు వినతి పత్రం సమర్పించారు. అక్రమాలు చేశారని గతంలోనూ ఛైర్మన్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.