నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా నూతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, పాల్గొన్న మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 14, 2026
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశలను అనుసరించి ప్రతి ఒక్కరు నడుచుకోవాలని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి తదితరులు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు