సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు, పాల్గొన్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో గురునానక్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.గురు నానక్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం, బ్రాహ్మణవాడలోని గురుద్వారాలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం ఆయన సిక్కులతో కలిసి ఉత్సాహంగా కీర్తనలు ఆలపించారు. అనంతరం ఉరేగింపు కార్యక్రమంలో పాల్గొని గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన తుపాజి అనంత కిషన్, కార్య దర్శితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.