గుంటూరు: 17 నుండి పోషకాహార మహోత్సవాలు: జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
Guntur, Guntur | Sep 15, 2025 పోషకాహార మహోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. పోషకాహార మహోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు జరుగుతుందన్నారు.ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన మాట్లాడుతూ మహిళలు మాత్రమే కాకుండా పురుషులకు కూడా పోషకాహారంపై అవగాహన కల్పించాలని నిర్ణయించడం జరిగిందని ఆమె చెప్పారు. స్థానికంగా లభ్యం అయ్యే చిరుధాన్యాలు, ఇతర పోషక విలువలు కలిగిన పదార్థాలపైన అవగాహన పెంచుటకు చర్యలు చేపట్టామని ఆమె అన్నారు.