బనగానపల్లె: ప్లాస్టిక్ మహమ్మారిని అంతం చేయాలి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి.
బనగానపల్లె: సకల మానవాళి మనుగడకు ప్రమాదకారిగా మారిన ప్లాస్టిక్ మహమ్మారిని పూర్తిగా అంతం చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి అన్నారు. సోమవారం బనగానపల్లెలో కేజీఆర్ కళాశాలలో 'నా బనగానపల్లె.. నా ఆరోగ్య కార్యక్రమం'లో భాగంగా పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలతో భేటీ అయి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, గ్లాసులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులతో కలిగే అనర్థాలను విద్యార్థులకు అవగాహన కల్పించారు.