ఒంగోలు అర్బన్: కొత్తపట్నం మండలంలోని సముద్రతీరంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం, సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చిన మహిళ మృతదేహం
Ongole Urban, Prakasam | Apr 19, 2026
ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రతీరంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతురాలు వివరాలు తెలియలేదని ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నామని కొత్తపట్నం పోలీసులు తెలిపారు.