ఆత్మకూరు: ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ పై అవగాహన కల్పించిన ఎక్సైజ్ అధికారులు
APఎక్సైజ్ సురక్ష యాప్‌పై ఎక్సైజ్ అధికారులు మర్రిపాడులోని పలు మద్యం షాపుల వద్ద సోమవారం అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని మద్యం సీసాపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ మద్యం నకిలీదా లేదా అనేది ధ్రువీకరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో షాపు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు