అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి రాప్తాడులో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆలయ కమిటీలో సభ్యులతో కలిసి వినతి భద్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు లోని ఆత్మకూరు శ్రీ సుబ్రమణ్య స్వామి వారి ఆలయానికి 12 కోట్లు రూపాయలు నిధులు, రాప్తాడు మండలంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని దేవాదాయ శాఖ మంత్రి కి వినతిపత్రం ఇచ్చామని ఎమ్మెల్యే పరిటాల పరిటాల సునీత పేర్కొన్నారు.