గుంతకల్లు: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును పదవి ఇచ్చు తొలగించాలి: గుత్తిలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు గద్దల నాగభూషణం
ఉండి నియోజకవర్గంలో మత ఘర్షణలకు కారణమైన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజులు పదవి నుంచి తొలగించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు.గుత్తిలోని గాంధీ సర్కిల్ వద్ద గురువారం నిరసన వ్యక్తం చేశారు.బీఎస్పీ రాష్ట్ర నాయకులు గద్దల నాగభూషణం,జిల్లా నాయకులు రామాంజనేయులు, పాస్టర్ల సంఘం అధ్యక్షులు మత్తయ్య మాట్లాడారు.రఘురామ కృష్ణంరాజును తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఎస్సీల పట్ల ఇచ్చిన తీర్పును విత్ డ్రా చేసుకోవాలన్నారు. ఎస్సీలు క్రైస్తవులుగా మారితే ఎస్సీ కుల హోదా ఉండదని తీర్పు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తన తీర్పును పున సమీక్ష చేసుకోవాలన్నారు.