పుట్టపర్తి: జూలై 10న జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను విజయవంతం చేయాలని కలెక్టర్ చేతన్ పిలుపు
జూలై 10వ తేదీన విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ చేతన్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో శనివారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లులకు రంగోలి పోటీలు నిర్వహిస్తామని విద్యార్థుల తండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆయా పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయికి ఎరిగిన వ్యక్తులు పాఠశాల అభివృద్ధికి ఏవైనా డొనేషన్ చేసిన వాళ్ళను కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.