నంద్యాల అర్బన్: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నంద్యాల జిల్లా చెందిన ముగ్గురు సజీవ దహనం
Nandyal Urban, Nandyal | Jul 2, 2026
గుంటూరు జిల్లాలో బుధవారం జరిగిన ప్రమాదంలో నంద్యాల జిల్లా వాసులు సజీవ దహనమయ్యారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్లకు చెందిన రవికుమార్ (36) డ్రైవర్, రమేశ్ (35) క్లీనర్. నాపరాయి రోడ్డుతో లారీలో మచిలీపట్నానికి బయల్దేరారు. పత్తిపాడులోని బోయపాలెం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆగి ఉన్న లారీని తప్పించబోయి డివైడర్ పైకి అవతలి రోడ్డులో వెళ్తున్న మరో లారీని ఢీకొట్టారు. మంటలు చెలరేగడంతో వీరితో పాటు మరో డ్రైవర్ చనిపోయారు.