చిన్నగూడూరు: ఉగ్గంపల్లి అంగన్వాడి కేంద్రాల్లో కుల్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ, అంగన్వాడీ నిర్వాహకులను నిలదీసిన బాధితులు
ఉగ్గంపల్లి అంగన్వాడి కేంద్రంలో నాణ్యతలేని కోడిగుడ్ల పంపిణీ చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం దుగ్గంపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు ప్రభుత్వం పంపిణీ చేసిన కోడిగుడ్లు నాణ్యతగా లేవని కుళ్ళిపోయిన గుడ్లను పంపిణీ చేయడం వల్ల తల్లి పిల్లల అనారోగ్య పరిస్థితికి దారితీస్తుందని సదరు అంగన్వాడి కార్యకర్తను అడిగితే తమకు అలాంటివే సరఫరా చేస్తున్నారని దీంట్లో మా తప్పేమీ లేదని వారు చెబుతున్నారని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఘటన కారకులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు