హత్నూర: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా దౌల్తాబాద్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించగా అనూహ్య స్పందన వచ్చింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ మోడీ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఒకేరోజు మోడీ బర్త్ డే తో పాటు తెలంగాణ విమోచనం విశ్వకర్మ జయంతి రావడం పట్ల బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.