శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసులందరికీ జోహార్లు:జిల్లా ఎస్పీ ధీరజ్
జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ.... పోలీసు అమరవీరుల త్యాగనిరతికి ప్రతి సంవత్సరము అక్టోబరు 21వ తేదీన పోలీసు అమరవీరుల దినముగా పరిగణిస్తున్నామన్నారు. దేశభద్రత కోసం పగలనక, రేయనక, విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్ళు, అధికారులు విధులను విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా వారు తమ ప్రాణ త్యాగాలను, సేవలను సింహావలోకనం చేసుకుంటూ సేవల అర్ధాన్ని పరమార్ధాన్ని గుర్తిస్తూ కొనియాడుట మనందరి కర్తవ్యము అన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, కరుడుగట్టిన మతోన్మాదం మితిమీరిపోతున్న ప్రస్తుత తరుణంలో పోలీసు వృత్తి ప్రాణాలతో చెలగాటం అని తెలిసి కూడా వాటిని లెక్కచేయక ప్రజాసేవలో నిమగ్నం అవుతున్నామన్నారు.