నారాయణపేట్: గాలి కుంటు మూతి సుంకు రోగాల నుండి మూగజీవాలను రక్షించాలి: గొర్రెల మేకల సంఘం జిల్లా కన్వీనర్ మహేష్ కుమార్ యాదవ్
ఇటీవల నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా మూగజీవాలు గొర్రెలు మేకలు గాలి కుంటు మూతి రోగాలు, సుంకు రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయని రోగాల బారి నుండి మూగజీవాలను కాపాడాలని గురువారం 11:30 గంటల సమయంలో పేట జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ అనిరుద్ కు గొర్రెల మేకల సంఘం జిల్లా కన్వీనర్ మహేష్ కుమార్ యాదవ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ లు వినోద్ పత్రం సమర్పించారు.