పటాన్చెరు: జిన్నారం మున్సిపాలిటీలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మున్సిపాలిటీ పరిధిలోని ఊట్ల, నల్తూరు, కొడకంచి, సొలక్ పల్లి తదితర గ్రామాల్లో వర్షం పడింది. వర్షంతో రహదారులు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆకస్మిక వర్షంతో ట్రాఫిక్ లో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.