జహీరాబాద్: పట్టణంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం జాతీయ పతాకం ఆవిష్కరించిన ఆర్డీవో దేవుజి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని ఆర్డిఓ కార్యాలయం వద్ద ఇన్చార్జి ఆర్డిఓ దేవుజి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ దశరథ్ మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ సుభాష్ రావు దేశముఖ్ జాతీయ జెండాను ఎగరవేశారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.