అనంతపురం అర్బన్: చిన్నారిపై కుక్క విచక్షణారహితంగా దాడి తీవ్ర గాయాలతో అనంతపురం ఆసుపత్రికి చిన్నారి
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
కడప జిల్లాలోని రైల్వే కొండాపురం మండలం ఈ ఈ కోడూరు గ్రామంలో ప్రమాదవశాత్తు చిన్నారిపై కుక్క విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని తొలుత తాడిపత్రి ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.