జహీరాబాద్: శాంతి నగర్ లో కొండముచ్చు దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో కొండముచ్చు దాడిలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం పట్టణంలోని సంతోషిమాత ఆలయం సమీపంలో కొండముచ్చు ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడ్డ వారికి జహీరాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.గత నాలుగు రోజుల వ్యవధిలో కొండముచ్చుల దాడిలో పదిమంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. అధికారులు స్పందించి కొండముచ్చుల దాడి నుండి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కొండముచ్చు దాడి చేసిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.