గుంతకల్లు: గుత్తి చెరువులో పొంగిపొర్లుతున్న నీరు, దిగువకు వెళ్ళిపోతున్న చేపలు, ఆదుకోవాలని కోరుతున్న గంగ పుత్రులు
అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా గత ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు నీటితో పొంగి పారుతున్నాయి. గుత్తి చెరువులో మరువ పారడంతో నీటి ప్రవాహానికి చెరువులోని చేపలు మొత్తం దిగువకు వెళ్లిపోతున్నాయి. దీంతో గంగపుత్రులకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమం మంగళవారం గుత్తి చెరువు వద్ద బెస్త కుల సంఘం నాయకులు మాట్లాడుతూ అప్పులు చేసి చేప పిల్లలను చెరువులో వదిలామన్నారు. చేపలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నామని అయితే ఇటీవల కురిసిన వర్షాలకు గుత్తి చెరువు మరువ పారడంతో నీటి ప్రవాహానికి చెరువులోని ఐదు టన్నులకు పైగా చేపలు దిగువకు వెళ్ళిపోయాయని అన్నారు.