రాజేంద్రనగర్: టోలిచౌకిలో హత్య కేసును చేదించిన పోలీసులు
టోలిచౌకిలో జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మద్యం మత్తులో మొబైల్ ఫోన్ విషయంలో ఆటో డ్రైవర్ మహమ్మద్ అయ్యూబ్, అతడి స్నేహితుడి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అయ్యూబ్ గొంతు నులిమి ఖలీద్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. సీసీ ఫుటేజీ ఆధారంగా ఓయోలో తలదాచుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.