ఆత్మకూరు: రేవూరు బీసీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలం, రేవూరు బీసీ బాలికల వసతి గృహాన్ని ఆదివారం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆమె మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ మల్లేశ్వరి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.