ఖైరతాబాద్: నగరంలో పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్ ఏర్పాటు చేస్తాం : బంజర హిల్స్ లో సిపి సజ్జనార్
నగరంలో పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని CP సజ్జనార్ తెలిపారు. బంజారాహిల్స్ ICCCలో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాల నియంత్రణ, 24/7 సిటిజన్ సర్వీసులు, కల్తీ ఆహారం, డ్రగ్స్ నియంత్రణపై దృష్టి పెడతామన్నారు. డ్రంక్ & డ్రైవ్, బాలికలపై జరిగే నేరాల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సంక్షేమం, మతసామరస్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుందన్నారు.