కోడుమూరు: కోడుమూరు పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన బైకులు అమ్ముకున్న కానిస్టేబుల్ సస్పెండ్
కోడుమూరు పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన బైకులు అమ్ముకున్న ఓ కానిస్టేబుల్ ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జగదీష్ సీజ్ చేసిన బైకులు విక్రయించాడని తేలింది. కే నాగలాపురం వద్ద అక్కడి పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో ఈ విషయం బయటపడింది. కోడుమూరు పోలీసులు 5 బైక్ లను రికవరీ చేశారు.