నంద్యాల అర్బన్: నంద్యాల- కర్నూలు రహదారిలో నిత్యం ప్రమాదాలే..
Nandyal Urban, Nandyal | Jul 6, 2026
ఆదివారం అనంతపురం వెళ్లి కారులో వస్తుండగా టైర్ పేలి ఆళ్లగడ్డ ASI సురేశ్ రెడ్డి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. నంద్యాల-కర్నూలు మార్గం పాణ్యం, తమ్మరాజుపల్లె సమీపంలోని మలుపుల వద్ద నిత్యం ప్రమాదాలు జరుగుతుండటం వాహనదారులకు శాపంగా మారుతోంది. ప్రతిరోజూ ఏదో ఒక ప్రమాదంతో కుటుంబ సభ్యులను కోల్పోవాల్సి వస్తుండటం ఆవేదన కలిగిస్తుంది. అతివేగం ప్రాణాలకు ముప్పు అని వాహనదారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది