తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో గంజాయి మొక్కల కలకలం, టైలర్స్ కాలనీలో ఆరడుగుల ఎత్తు ఉన్న గంజాయి మొక్కలను గుర్తించిన పోలీసులు
తాడిపత్రిలో గంజాయి మొక్కలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టణ పరిధిలోని టైలర్స్ కాలనీ రెండో సందులో ఓ ఇంటి నిర్మాణానికి ఏర్పాటు చేసుకున్న ఫ్లాట్లో దాదాపు 6 అడుగులు ఎత్తు ఉన్న మొక్కలు గుర్తించారు. గంజాయి మొక్కలు గుర్తించిన పోలీసులు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరికి సమాచారం అందించారు. దీనిపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.