పెద్దవూర: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 588 అడుగులకు చేరుకుంది
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది .ఈ సందర్భంగా మంగళవారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల గాను ప్రస్తుతం 588 అడుగుల వద్ద ఉందన్నారు. ఇన్ ఫ్లో,ఔట్ ఫ్లో 49,963 క్యూసెక్కులుగా కొనసాగుతుందని, త్రాగు సాగునీటి అవసరాలకు అధికారులు నీటిని విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు.