డోన్: బేతంచెర్ల లో వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
Dhone, Nandyal | May 25, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలోని దుర్గా పేటలో వెలసిన వేంకటేశ్వర స్వామి ఆలయం 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కళ్యాణం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వహకుడు రిటైర్డ్ ఎస్సై మద్దయ్య కుటుంబసభ్యులు, కాలనీవాసుల ఆధ్వర్యంలో స్వామి ఉత్సవ మూర్తులను కొలువుంచి, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ కళ్యాణం గావించారు.