ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న, కమిషనర్,తాసిల్దార్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణములోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో మున్సిపల్ కమిషనర్ కిషోర్, తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి పాల్గొన్నారు, ఇంటి పన్ను వార్డులో పలు సమస్యలపై లబ్ధిదారులు అధికరణకు వినతి పత్రాలు సమర్పించారు, అనంతరం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు